ఐసీడీఎస్ ప్రాజెక్టుల పునర్విభనలో బాగంగా తాళ్లూరు పూర్వ సమితిగాలో ఉన్న ప్రాజెక్టును దర్శి నియోజక వర్గ కేంద్రంలో ఏర్పాటు చేసి నియోజక వర్గంలోని ఐదు మండలాలను కలపటంతో ఐసీడీఎస్ సేవలు మరింత మెరుగు అయ్యే అకాశం ఉందని వైఎస్సార్సీపీ దర్శి మండల ఇన్చార్జి మద్దిశెట్టి శ్రీధర్ అన్నారు. దర్శిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. సీడీపీఓ సీహెచ్ భారతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి శ్రీధర్, ప్రజా ప్రతినిథులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చొరవతో కార్యాలయం ఏర్పాటు త్వరగా ప్రారంభమైనట్లు సీడీపీఓ సీహెచ్ భారతి చెప్పారు. ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దర్శి మార్కేట్ కమిటీ చైర్మన్ వైవీ సుబ్బయ. రాష్ట్ర గ్రీనింగ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు ఎంపీపీలు జీఎస్ అచ్చయ్య తాటికొండ శ్రీనివాసరావు, ఎస్ఎస్ బ్రహ్మానంద రెడ్డి, బెల్లం చంద్రశేఖర్, జెడ్పీటీసీలు తాళ్లూరు, దొనకొండ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సుధాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి, కొరివి ముసలయ్య, ఎసీడీపీఓ అంజమ్మ, సూపర్వైజర్లు హేమలత, జ్యోతి, నీ అనురాధ కమల కుమారి, యశోద, అనంద లత. అంగన్వాడీ టీచరు పాల్గొన్నారు.



