జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహణకు నివాసాలకు వెళ్లిన జెసీఎస్ కన్వినర్లకు, గృహసారధులకు, వలంటీర్లకు ప్రజల నుండి మంచి మద్ధతు లభించినదని, ప్రతి ఒక్కరూ చక్కగా ఆదరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాలతో తాము ఎంతో లబ్దిపొందామని ఆనందం వ్యక్తం చేసినట్లు వైఎస్సార్సీపీ దర్శి మండల ఇన్చార్జి మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. దర్శి పట్టణంలో శనివారం జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ ముగింపు సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులచే భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ దర్శి, తాళ్లూరు మండల ఇన్చార్జీలు మద్దిశెట్టి శ్రీధర్, రవీంద్రలు ముఖ్య అతిథులుగా ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లో దివంగత సీసీం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ దర్శి నియోజక వర్గ అభివృద్ధికి, సంక్షేమ పథకాలు అందించటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కృషి మరువలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ తిరిగి 2024లో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టిని బలపరచి, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవటానికి కృషి చెయ్యాలని పిలుపి నిచ్చారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ విలేకరుల సమావేశం నిర్వహించి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని దర్శి నియోజక వర్గంలో విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. సహకరించిన ప్రతి ఒక్కరికి “ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ర్యాలీ ప్రారంభించటానికి ముందు దద్దాలమ్మ గుడిలో మద్దిశెట్టి రవీంద్ర, శ్రీధర్, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, రాష్ట్ర గ్రీనింగ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు ఎంపీపీ లు గోళ్లపాటి సుధా అచ్చయ్య తాటికొండ శ్రీనివాసరావు. ఎస్ఎస్ బ్రహ్మానంద రెడ్డి, బెల్లం చంద్రశేఖర్, జెడీటీసీలు తాళ్ళూరు , దొనకొండ జెడ్పీటీసీ లు , మారం వెంకట రెడ్డి, సుధాకర్, వైస్ ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి, కొరివి ముసలయ్య, ఎం నాగార్జున రెడ్డి, కోటి రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సా నికొమ్ము తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, కార్యదర్శి గోను నారాయణ రెడ్డి, కౌల్సిలర్లు వీసీ రెడ్డి , అవుల జ్యోతి శివా రెడ్డి, మేడగం మోహన్ రెడ్డి మోహన్ బాబు, బాబు, నారాయణ రెడ్డి, ముత్తనీటి సాంబయ్య, సొసైటీ చైర్మన్ వేమి రెడ్డి చెన్నా రెడ్డి, యర్రయ్య, కట్టెకోట హరీష్, దర్శి, తాళ్లూరు, దొనకొండ, ముండ్లమూరు, కురిచేడు జెసీఎస్ కన్వినర్లు ఎదురు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, యాడిక శ్రీనివాస రెడ్డి, పోలయ్య, మేడికొండ జయంతి. సుబ్బారెడ్డి, మాజీ దొనకొండ అధ్యక్షుడు నా రప రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవ ప్రసాద్. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు గంగి రెడ్డి పాలెం యలమంగా రెడ్డి, శేషం రమణయ్య, శ్రీనివాస రెడ్డి, కిక్కి రమణా రెడ్డి, మిల్లర్ బుజ్జి, కొడవటి జాన్, అచ్చా రావు, వెంకట్రాద్రి చౌదరి, బాదం రమణా రెడ్డి, దేవస్థాన కమిటి చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, మాజీ చైర్మన్ సానే ఆంజనేయులు, పులి బ్రహ్మా రెడ్డి, ముచ్చుమారి బ్రహ్మారెడ్డి, చందన, పూనూరి దేవదానం తదితరులు పాల్గొన్నారు.





