ముండ్లమూరు మండల విద్యా వనరుల కేంద్రంలో అటెండర్ గా పనిచేస్తూ ప్రమాదంలో గాయపడిన ముప్పాళ్ళ చిన్న యోగయ్యకుఉపాధ్యాయులు రూ . 43, 500 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి క్షేమాలు అడిగి తెలుసుకుని అందజేశారు. యోగయ్య పది సంవత్సరాలు పాటు మండల విద్యా వనరుల కేంద్రంలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహించారు. నిధుల కొరత వలన అతనిని తొలగించారు. నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కుటుంబం గడవ లేని స్థితిలో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు గుర్తించిన ఉపాధ్యాయులు ఎవరికి వారు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం ప్రకటించారు.77 మంది ఉపాధ్యాయులు నుండి43500 రూపాయలు వసూలు కాగా ఆ మొత్తాన్ని యోగయ్యకు అందించారు. దీంతో యోగయ్య ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
అటెండర్ కు ఆర్థిక సహాయం
30
Apr