బొట్లపాలెం గ్రామంలో విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఐదు ప్రభలను ఏర్పాటు చేసారు. అందులో వైఎస్సార్సీపీ అభిమానులు మూడు ప్రభలను, టిడీపీ రెండు ప్రభలను ఏర్పాటు చేసారు.
వర్షంతో ఆందోళన …
తిరునాళ్ల సందర్భంగా ప్రభల ఏర్పాటు ఏర్పాటుకు భక్తులు ఏర్పాటు చేసారు. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా పెద్ద వర్షం రావటంతో భక్తులు ఆందోళ చెందారు.
బందోబస్తు ఏర్పాటు
దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో దర్శి సీఐ రామకోటయ్య పర్యవేక్షణలో దర్శి ఎస్ఐ రామక్రిష్ణతో పాటు మరో ఐదుగురు ఎస్ఐలు . 50 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసారు.


