విద్యార్థులు, నిరుద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ (ఎపీఎస్ఎస్ఓసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణకు ఉపయోగించుకుని మంచి ఉద్యోగాలు పొంది ఆర్ధికంగా స్థిర పడాలని వక్తలు అన్నారు. దర్శి డిగ్రీ కళాశాలలో మంగళవారం స్కిల్ హబ్ ఏర్పాటు చేసారు. కోర్సు నందు డొమస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా 30 మంది . అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా 30 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా: ఎప్లాయిమెంట్ అధికారి భరద్వాజ, నైపుణ్య అధికారి లోకనాథం: ప్రిన్సిపాల్ సావిత్రి, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
