బెల్లంకొండవారిపాలెం పంచాయితీ పరిధిలో నిధుల దుర్వినియోగం గ్రామస్తుడు జివి శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నివేదిక మేరకు గ్రామ సర్పంచి, గ్రామకార్యదర్శులకు మంగళవారం నోటీసులు జారీ చేసారు. విచారణలో మెజారీటి వార్డు సభ్యులు ఆమోదం మేరకు వ్యవహరించనట్లు గాను, పంచాయితీ రాజ్ చట్టం మేరకు సకాలంలో పంచాయితీ సమావేశాలు నిర్వహించక పోవటం, ఎంఎన్ఆర్అస్ఈజీఎస్ లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించక జాప్యం చేస్తున్నట్లు గుర్తించినట్లు అందుకు సంజాయిషీ కోరుతూ నోటీసులు డీఎల్పీఓ జీవి నారాయణ రెడ్డి జారీ చేసారు.
బెల్లంకొండవారిపాలెం పంచాయితీలో నిధుల దుర్వినియోగంపై డీఎల్పీఓ నోటీసులు
02
May