ముండ్లమూరు మండల కేంద్రమైన సచివాలయంలో పనిచేస్తున్న మహిళా శిశు
సంరక్షణ కార్యదర్శి (జీఎంఎస్) శాంతి ప్రియ సస్పేషన్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. వివరాలలోనికి వెలితే… మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి విధులకు యూనిఫామ్ లేకుండా హాజరు కావటం, పోలీస్ బందోబస్తు విధులు నిర్వహించటం లేదంటూ ఎస్సై సంపత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్పీ మలిక గర్గ్ ఎప్రియల్ 4న సస్పెండ్ చేసారు. అయితే ఆ ఉత్తర్వులపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉత్తర్వులపై స్టే విధిస్తూ యధావిధిగా సచివాలయంలో విధులకు హాజరు కావాలని ఆ ఉత్తర్వులలో పేర్కోన్నారు.
మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి సస్పేషన్ ఉత్తర్వుల పై స్టే
02
May