గ్రామ సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు సమయపాలన, పారదర్శకత పాటించాలి – ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయ్యాలి

గ్రామ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ పారదర్శకంగా పనిచెయ్యాలని ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు కోరారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో గురువారం మండలంలోని సచివాలయ ఉద్యోగులు, గ్రామకార్యదర్శులు, విఆర్డీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఉద్యోగి సచివాలయానికి అనుసంధానం కనుక సంబంధిత రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత ఫెషియల్ నమోదు తర్వాత మూమెంట్స్ రిజిస్టర్ లో నమోదు చేసి సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఆదేశాలను తెలియజేసి విధులకు వెళ్లాలని చెప్పారు. సాయంత్రం వేళ కూడ తప్పనిసరిగా స్పందనలో హాజరు కావాలని కోరారు. జగనన్న పాల వెల్లువ పథకం లేకుండా రైతులకు మద్దతు పాల ధర లభించేదా అన్న విషయాలను రైతులకు వివరించి పథకంలో ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలని కోరారు. నాడు- నేడు పాఠశాలలలో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 31లోపు పనులు పూర్తి అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటునట్లు ఎంఈఓ జి. సుబ్బయ్య వివరించారు. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో పనులను పరిశీలించాలని చెప్పారు. కార్యక్రమంలో నాడు నేడు డీఈ విశ్వనాధ్, ఎఈ గోపి, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *