ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం పై టీడీపీ కడుపు మంట ఎందుకో?: మంత్రి బొత్స – ఎయిర్‌ పోర్టుకు 12 వేల ఎకరాలు భూసేకరణ చేయాలంటే మేమంతా జగనన్నను కలిసి 12 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పాం – వైయస్‌ జగన్‌ చేసిన పోరాటంతోనే నేడు 2,300 ఎకరాలకు కుదించగలిగాం – చంద్రబాబు ఏ పని చేసిన రాజకీయాల కోసమే చేస్తారు- రైతులతో సంప్రదింపులు తర్వాతే భూసేకరణ చేశాం

భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవంపై టీడీపీ నేతలకు కడుపు మంట ఎందుకని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా అక్కస్సు వెల్లగక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల విమర్శలు, ఈనాడు రాతలను మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పం. భోగాపురం ఎయిర్‌పోర్టును మూడేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *