ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో అంకాలమ్మ తల్లి 60వ తిరుణాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 6 గంటలకే మేళ తాళాలతో ప్రతి ఇంటి నుండి మహిళలందరూ ఒక్క పొద్దులతో ఉండి ఎంతో ఉత్సాహంగా బిందెలతో పసుపు కుంకుమ నీళ్లు తీసుకొని అమ్మవారికి జలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృత మాలతో అభిషేకాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పుట్టింటి వారైనా పల్లా శ్రీనివాసరావు అండ్ బ్రదర్స్ సమర్పించే పసుపు కుంకుమలతో పాటు ప్రభతోపాటు అన్నం ఆంజనేయులు కుమారుడు శ్రీనివాసరావు దంపతులచే అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని మేళ తాళాల మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం దేవస్థానం ధర్మకర్త పాశం కృష్ణయ్య, ఆలయ పూజారులు కోనంకి సుబ్బారావు, అత్తులూరి వెంకట నవీన్ కుమార్ ఆచార్యులు పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద గ్రామస్తులు ఐక్యంగా శ్రీకృష్ణ యాదవ సంఘం, వాల్మీకి సంఘం, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మూడు ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రభలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


