జగనన్న గృహ నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేయాలని తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ అన్నారు . మండలంలోని తమ్మలూరు గ్రామంలో హౌసింగ్ డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లబ్ధిదారులతో కలిసి నిర్మాణాలలో జాప్యం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిర్మాణ స్థాయిని బట్టి తక్షణమే బిల్లులు చెల్లించాలని సూచించారు. ఇంటి నిర్మాణాల గురించి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, హౌసింగ్ ఏఈ హనుమంతరావు, వీఆర్వో రవిశంకర్, పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, వెలుగు సీసీలు గురవయ్య, దాసు తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
05
May