తాళ్లూరు మండలంలోని ఎబీసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో తమ ప్రతిభ చాటారు. పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులలో 42 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై, 97.67శాతం సాధించినట్లు ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వర రావు తెలిపారు. తంగిరాల నిర్మలా నివేదిత (582), ఎస్ చందన (581), ఎం ప్రసన్నాంజనేయులు (580), కుమ్మిత విష్ణువర్ధన్ (566), కె. సృజన (563), సీహెచ్ జాహ్నవి (560), కె. యశ్వంత్ రెడ్డి (560), ఎం. సింహాద్రి (558), ఎం.శివా రెడ్డి (553), ఎల్. భాస్కర్ రెడ్డి (552), బి. సింధూహారిక (547), గోపి రెడ్డి (547), ఎస్. భవ్య (544), ఎల్. భ్రహ్మతేజ (533), ప్రణయ్ రాజ్ (533). పవన్ కళ్యాణ్ (527), కె. తేజశ్విని (518), కొండ గురువా రెడ్డి (504) మార్కులు సాధించారని తెలిపారు. 580 మార్కులకు పైగా ముగ్గురు, 550 మందికి పైగా 10 మందికి, 500 మార్కులకు పైగా 17 మంది సాధించారని తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, పిన్సిపాల్ కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబు, ఉపాధ్యాయులు యలమందారావు, సుబ్బయ్య, కొండల రావు, వెంకటరావులు అభినందనలు తెలిపారు.
