తాళ్లూరు శ్రీ సరస్వతి హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభ చాటినట్లు చైర్మన్ ఎవీ రమణా రెడ్డి తెలిపారు. ఆవుల లక్ష్మి శివకుమార్ (587) మార్కులతో ప్రధమ స్థానంలో నిలవగా, కట్టా భార్గవి (579), సోమేపల్లి రాగామృత (576), సోమ రత్న సుమాంజలి (575), కుమ్మిత రాజా రెడ్డి (571) మార్కులు సాధించినట్లు చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను సంస్థ చైర్మన్ ఎవీ రమణారెడ్డి, డైరెక్టర్స్ ఆవుల గణేష్ రెడ్డి, ఆవుల గంగా శంకర్ రెడ్డి, హెచ్ఎం శ్రీరామమూర్తి, రత్నం, వెంకా రెడ్డి, విజయరావులు, ఉపాధ్యాయులు అభినందించారు.
