తాళ్లూరు మండలంలో పాఠశాలల్లో జరుగుతున్న నాడు – నేడు పనులను, జగనన్న విద్యాకానుక (జెవికే) స్టాక్ పాయింట్స్న జిల్లా విద్యాశాఖాధికారి పి. రమేష్ శనివారం పరిశీలించారు. నాగంబొట్లపాలెం (ఎఎ), తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఎంఈఓ, ఇంజనీరింగ్ సిబ్బందిని అభినందించారు. తాళ్లూరు ఎంఆర్సీని తనిఖీ చేసి జగనన్న విద్యాకానుక స్టాక్ పాయింగ్స్ భద్రత | కిట్స్ తీసుకోవటం, పంపిణీ చేయు విధానం గురించి తగు సూచనలు చేసారు. ఆయా కార్యక్రమాలలో ఈఈ బాస్కర్ బాబు, డీఈ విశ్వనాథం, ఎంఈఓ జి. సుబ్బయ్య, ఎఈ గోపి, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.
