పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మాంటిసోరి విద్యార్థులు అద్వితీయమైన ఫలితాలు కనబరిచారని పాఠశాల చైర్మన్ ప్రకాష్ బాబు తెలియజేశారు. ఎస్ వి కృష్ణ సాయి (588) మార్కులతో ప్రథమ స్థానంలో, బి చందన (587) మార్కులతో ద్వితీయ స్థానంలో మరియు హన్సిక (584 )మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని పాఠశాల ప్రిన్సిపాల్ నురుద్దిన్ తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 150 మంది పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించడంతోపాటు 11 మంది విద్యార్థులు 570 పైగా మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన ప్రతి ఇద్దరు విద్యార్థులలో ఒక విద్యార్థికి 500 కు పైగా మార్కులు వచ్చాయని పాఠశాల కరస్పాండెంట్ శబరినాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించించారు.
పదవ తరగతిలో ఒంగోలు మాంటిసోరి విద్యార్థుల మార్కుల ప్రభంజనం
07
May