తాళ్లూరు మండలంలోని
శివరామపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం నెల పొంగళ్లను సమర్పించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పొంగళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్చించారు. అన్నదానం నిర్వహించారు. మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్.జి. వెంకటేశ్వర రెడ్డి, పార్టీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ. శివరామపురం సర్పంచి బొడ్డు రాములు, దోసకాయపాడు సర్పంచి కెఎస్ వెంకట రామిరెడ్డి, ఎంపీటీసీలు అనపర్తి చిన పుల్లమ్మ, యామర్తి ప్రభుదాస్ వైఎస్సార్సీపీ నాయకులు ఆలోకం హరిబాబు, శీలం వెంకట రెడ్డి, నారిపెద్ది క్రిష్ణారావు, మన్నం వేణు, మన్నం వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి కాశిరెడ్డి, ఉప్పల పాటి బ్రహ్మయ్య, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు.



