ముండ్లమూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడి ది సంతమాగులూరు మండలంలో కేంద్రమైన సంతమాగులూరు గ్రామానికి చెందిన కారసాని వెంకటరెడ్డి(42) గా గుర్తించారు. వెంకట రెడ్డి ముండ్లమూరు గ్రామ సమీపంలో చింత చెట్టు వద్ద శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న దర్శి సిఐ జె రామకోటయ్య, ముండ్లమూరు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న నాగారపమ్మ కొలుపులకు ఆదివారం ముండ్లమూరు వచ్చాడు. తెల్లవారే సరికి శవమై కనిపించాడు. మృతదేహానికి సమీపంలో ద్విచక్ర వాహనం ఉండడంతో దాని ఆధారంగా మృతునిది సంతమాగులూరు గ్రామం గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్వో కావూరి దయానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ తెలిపారు.
ముండ్లమూరు మండలంలో వ్యక్తి అనుమానస్పద మృతి – మృతుడు వెంకట రెడ్డి సంతమాగులూరుగా గుర్తింపు
08
May