మొక్కజొన్న నిల్వలను పరిశీలించిన మార్కేఫెడ్ డీఎం

మొక్కజొన్న నిల్వలను మార్కెఫెడ్ డీఎం హరిక్రిష్ణ మంగళవారం పరిశీలించారు. శివరామపురంలో రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర కల్పించినదని ఎవరూ తక్కువ ధరలకు అమ్ముకోవద్దని చెప్పారు. మండలంలో మొక్కజొన్న రైతులకు సంబంధించి ఆర్టికేలలో రిజిస్ట్రేషన్
చేస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు డీఎం దృష్టికి తెచ్చారు. మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర
క్వింటాళ్లుకు రూ. 1962 ఉందని ఇప్పటి వరకు 44 మంది రైతులు 2919 క్విటాళ్ల
ధాన్యం కొనుగోలుకు రిజి స్టేషన్ చేసుకున్నట్లు చెప్పారు. గతంలో
మొక్కజొన్న బహిరంగ మార్కెట్లో రూ. 2300 వరకు అమ్మకాలు జరిగాయని
నేడు ధర పతనమయినట్లు రైతులు డీఎం దృష్టికి తెచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *