అవినీతి అక్రమాలకు, వేధింపులకు పాల్పడుతున్న తాళ్లూరు ఇంచార్జి ఎంపీడీవో వై.శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని అధికార వైఎస్ఆర్సిపి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, పలురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీడీవో పనితీరును వ్యతిరేకిస్తూ ఎం పీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు పార్టీశ్రేణులు ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంపీడీవో వై. శ్రీనివాస రావు ఎంపీడీవో గా ఇన్చార్జిగా వచ్చిన నాటి నుండి ప్రజా ప్రతినిధులను, సచివాలయసిబ్బంది, వాలంటీర్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎంపీపీగా తాను పంచాయతీ కార్యదర్శులతో సమా వేశం నిర్వహిస్తుండగా కార్యదర్శులు వెళ్ల వద్దని ఆదేశాల్విటం, వచ్చినవారికి మొమోలు జారీ చేస్తూ వేధిస్తున్నారని తెలిపారు. తనమాటవినని సచివాలయ సిబ్బంది, వలంటీర్ల వేతనాల్లో కూడా కోత విధిస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏపనికావాలన్నా ఎంపిడీవోకు లంచం ఇస్తూ చేయి తడపాల్సిందేనని ఆ
రోపించారు. ఎంపీడీవోను మార్పుచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ద్వారా సిఫార్సు లెటర్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేయటం జరిగిందన్నారు. పలుమార్లు జడ్పీసీవోను కలిసి ఎంపీడీవో అక్రమాలకుపాల్పడుతున్నాడని, ప్రజా ప్రతినిధులకు విలువ ఇవ్వటం లేదన్న విషయాన్ని తెలిపి బదిలీ చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. గత ఎంపీడీవోల పనితీరు బాగుండేదని, ప్రస్తుత ఎంపీడీవో పనితీరు ఇబ్బందికరంగా చాలా ఇబ్బందిగా వున్నందున తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ…. ఎంపీడీవో శ్రీనివాస రావు వచ్చినాటినుండి తనఇష్టాను సారం విధులు నిర్వహిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులుగా తాము సచివాలయ సిబ్బంది, వాలం టీర్లతో సమావేశం ఏర్పాటు చేయగా తనకు చెప్పకుండా సమావేశాలకు ఎలావెల తారంటూ బెదిరించటం, సిబ్బందికి మెమోలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు.
అధికారపార్టీలో వుండి కూడా తమమాట ఎంపీడీవో వినకుంటే తాము ప్రజాప్రతి నిధులుగా వుండటం దేనికని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపోహస్యం చేసే విధంగా ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తూ , విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా పనులు జరిగే తాళ్లూరు మండలంలో ఇటువంటి అస్తవ్యస్తపాలకు తెర తీసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆయన రెగ్యులర్ గా ఉన్న నాగులుప్పలపాడు మండలంలో కూడా అక్కడ ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వకుండా సర్వసభ్య సమావేశాలను సైతం ఏర్పాటు చేసిన ఘనత ఈ ఎంపీడీఓకే ఉన్నదని అన్నారు. ప్రతి పనిలో పర్సంటేజీలు ఆశిస్తూ మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు వద్ద కూడా పర్సంటేజీలు తీసుకున్న ఘనత ఎంపీడీఓ ది అని అన్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సైతం ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తూ ప్రతిరోజు 10 మస్టర్లకు తనకు నగదు ఇస్తేనే సంతకాలు చేస్తానంటూ చేయడంతో అనేక పంచాయతీల్లో పనులు జరగక కుంటుబడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా గ్రామ కార్యదర్శిలకు పారిశుధ్యం పై సరైన చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్వహిస్తే అటువంటి సమావేశాలకు వెళ్ళవద్దు అంటూ బహిరంగంగా వాట్సాప్ లో మెసేజ్లు చేస్తూ అనేక విధంగా వారిని వేధిస్తూ పాలను కుంటుపడే విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. అంతేకాకుండా తమపై పోలీసులకు సైతం చెబుతూ తాము ఏదో ఆయనను ఇబ్బంది పెడుతున్నామంటూ తప్పుదారి పట్టించడం మంచి పద్ధతి కాదని అన్నారు. వైస్ ఎంపీపీ మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి మాట్లాడుతూ లంచాలకు అలవాటు పడిన ఎంపీడీవో ప్రజాప్రతినిధులు ను చిన్న చూపు చూస్తూ ప్రజా ప్రతినిధులు దగ్గర సైతం లంచాలు వసూలు చేస్తూ చివరికి ఉపాధి హామీలు సైతం నగదు తీసుకొని లంచాలకు అలవాటు పడిన ఎంపీడీవో నీ తక్షణం తప్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దర్శిఎఎంసీ మాజీ డైరెక్టర్ డి. రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వలంటీర్ వ్యవస్థలో ప్రభుత్వానికి వారదలుగా నిలుస్తున్న వలంటీర్లను సైతం నిత్యం వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఎంపీడీవో తాళ్లూరు మండలంలో పనికిరాదని అన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వద్ద లంచాలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఎంపీడీవో పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు . గ్రామాల్లో సర్పంచులకు సైతం సమాచారం ఇవ్వకుండా గ్రామ సభలను సైతం ఏర్పాటు చేయాలని గ్రామ కార్యదర్శులకు సూచించడం ఆయనకు ప్రజాప్రతినిదులపై ఉన్న చిన్న చూపుకు నిదర్శనమని అన్నారు. ఇటువంటి ఇన్చార్జి ఎంపీడీవో పై తక్షణం కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు . విఠలాపురంమాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి మాట్లాడుతూ….. తనకు రావలసిన బిల్లుల విషయమై తన వద్ద లంచం తీసుకున్న విషయాన్ని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఎన్నడు కూడా ఇలా నేరుగా లంచాలు తీసుకునే ఎంపీడీవో తాళ్లూరు మండలంలో పనిచేయలేదని అన్నారు.ఎంపీడీవోఆక్రమాలకు పాల్ప తున్నా రని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు కరిముల్లా, సర్పంచ్లు చార్లెస్ సర్జన్, కాలేషావలి, పి ఎస్ శ్రీకాంత్ రెడ్డి , వరలక్ష్మి, ముచ్చుమారి బ్రహ్మారెడ్డి ,ఎంపీటీసీ జిఎస్ ప్రభాకర్ రెడ్డి, బాలకోటయ్య, పార్టీ కార్యదర్శి యాడికి యమందారెడ్డి , గుంటి గంగా భవాని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కటకం శెట్టి శ్రీనివాసరావు ,సొసైటీ చైర్మన్లు మంచాల వలసారెడ్డి, శనివారపు శ్రీనివాసరెడ్డి , మాజీ సర్పంచులు ఓబుల్ రెడ్డి, టీవీ సుబ్బారెడ్డి, కొరపాటి వారి పాలెం జే సి ఎస్ కన్వీనర్ విష్ణు, నాయకులు యలమందరావు, జయరామి రెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (చందన), కోట వెంకటేశ్వర్ రెడ్డి , కైలాష్ రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యా లయం వద్ద దాదాపు గంట పాటు బైటాయించి నిరసన తెలిపారు. ఎంపీడీవో పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


