అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ఎరువులు, పురుగు మందుల షాపులను ఆయన తనిఖీ చేసి ఎరువుల స్టాకులను, రికార్డులను పరిశీలించారు. నాణ్యతలేని ఎరువులు, పురుగు మందులు ఎవరు విక్రయించరాదని, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులు విత్తనాలు అమ్మరాదని షాపు యజమాల తో అన్నారు. షాపుల వద్ద ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు బోర్డుపై నమోదు చేయాలని సూచించారు. ఎరువులు, పురుగు మందులు, నాణ్య పరీక్షల నిమిత్తం మండలంలో ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన షాపుల నుంచి శాంపిల్స్ను తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ పరీక్షా కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించే దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైతే వారి లైసెన్స్ను రద్దు చేస్తామన్నారు. ఏఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
