ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొళ్లపూడి వేణుబాబు సోమవారం పాదయాత్రలో పాల్గొన్నా రు. తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత కాదర్శి వేణుబాబు పాదయాత్ర లో లోకేష్ చేయిపట్టి కొంత దూరం నడిచారు. ఈసందర్భంగా వేణుబాబు మాట్లాడుతూ… 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు సిఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రజల కష్టాలను తొలగించే ప్రణాళిక రూపొందిస్తారన్నారు. ప్రజలు టీడీపీకి అండగా నిలవాలని పిలుపు నిచ్చారు.
