కారంచేడులో 38 ఏళ్ల క్రితం దళితవాడపై పెత్తందార్లు దాడి చేసిన ఘటనలో మృతి చెందిన వారికి దళిత సేన, ప్రజాసంఘాల నాయ కులు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యా లయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నాయకులు ప్రేమకుమార్ , కోటేశ్వరరావు, మాట్లాడుతూ.. మృతుల త్యాగ ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం(అట్రాసిటీ యాక్ట్) అమలులోకి వచ్చిందన్నారు. ఇప్పటికీ కూడా దళితులపై దాడులు ఆగడం లేదని, పాలకులు వీటిని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్య క్రమంలో నాయకులు రవి, రమేష్, కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

