మిరప వేసే ప్రతిరైతు దుక్కిలో ట్రైకో డేరా విరి డిటి తప్పని సరిగావేయాలని వ్యవసాయ అధికారి ప్రసాదరావు సూచించారు. రజానగరం లో నారు మళ్ళ ను మంగళవారం పరిశీలించారు. వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ…
ట్రైకో డేరా విరి డిటి లో ఉన్న శక్తి వంతమైన బాక్టీరియా వేరు నుండి గాని, ఆకుల నుండి గాని, మొక్కల కణవ్యవస్థ ద్వారా లోనికి ప్రవేశించి ముక్కలలోని అన్ని భాగాలకు వ వ్యాపిస్తుందని, మొక్క లంలోని కణ జాలం లోనికి చోచ్చుకొని పోయి స్థిర నివాసం ఏర్పరచు కొనడం వలన, మొక్కలలో తేగుళ్ళను తట్టుకునే రోగనిరోధక శక్తి పేరుగుతుందని, మొక్కలలో వ్రేళ్ళనుండి, ఆకు చివరి బాగం’ వరకు వ్యాపించి, తెగుళ్ళన్నింటిని సమర్థవంతంగా అరికడుతుందని, మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు తెలిపారు. మిరప పంట సున్నితమైనదని, దీనిపై వచ్చే ఎండు తేగులు, కళ్ళు తెగులును సమర్థంగా అరికడుతుందన్నారు.
దీనిని భూమిలో గానీ, చివికిన పేడ ఎరువుతోగాని, ఇసుకలో గానీ కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు వేసు కోవాలని, దీనిని నీటిలో కలిపి నారు వేర్లను తడిపి, గుంజుకోవచ్చని, పంటపై పిచికారీ చేయ వచ్చని, నీరు పారేటపుడుగానీ, డ్రైవ్ ప్రేవుల ద్వారా గానీ పారించ వచ్చని తెలిపారు. మిరప సాగు చేసే ప్రతీ రైతు తప్పనిసరిగా డి. వి.డివాడాలని, తద్వారా తెగళ్ళ నివారణ సమర్థవంతంగా చేపట్ట వచ్చని, వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉన్నా యని తెలిపారు.. కార్యక్రమంలో వి. ఏ. ఎ అశోక్ రైతులు పాల్గున్నారు.
