కేవలం 80రోజుల్లోపే పంట చేతికి వచ్చే సజ్జ సాగును రైతులు చేపట్టాలని వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు కోరారు. నాగంపబొట్ల పాలెం గ్రామంలో సాగుచేసిన సజ్జను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ…తేలిక నేలల్లోను, సాగు చేయవచ్చని, ఎకరాక కేవలం 2 కిలోల విత్తనంతో 15 క్వింటాళ్ళు దిగుబడి పొందవచ్చని, ప్రస్తుత మార్కేట్ ధరలను మట్టి రూ.50వేలు పొందే అవకాశం ఉందని ఎ ఓ బి.ప్రసాదరావు తెలిపారు.
కంకి దశలో ఉన్న క్షేత్రాలను సందర్శించి, మొక్కలు పుష్పించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం, వర్షపు తుంపరలు, వాతావరణం చల్లగా ఉండటం తేనె బంక తెగులు వ్యాప్తికి దోహద పడుతుందని చెప్పారు .దీని నివారణకు పైరు పూత దశలో మాంకోజెబ్ 2.5గ్రా /లీటరు నీటికి కలిపి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో వి.ఎ.ఎ. డి. శ్రీను తదితరులు పాల్గోన్నారు.

