జగనన్న సురక్షతో అర్హులకు లబ్ధి – ఎంపీడీవో కుసుమకుమారి – పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సిపి పాలనలో సంక్షేమ పథకాలు అమలు జేసిఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతి

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. ముండ్లమూరు మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో బుధవారం ఆ గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీదేవి రాముడు అధ్యక్షతన జగనన్న సురక్ష గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కుసుమ కుమారి మాట్లాడుతూ… ప్రజలు తాము పొందే సర్టిఫికెట్లకు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా అందిస్తున్న సేవ లనువినియోగించుకోవాలని కోరారు. అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. మండల జే సి ఎస్ సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి మాట్లాడుతూ … వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జగనన్న పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో పేద ప్రజలు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారని తెలిపారు. సర్పంచ్ గొర్రె శ్రీదేవి రాముడు మాట్లాడుతూ …ప్రభుత్వం 11 రకాల సర్టిఫికెట్లు అర్హులైన వారికి అందిస్తుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో 19 రోజుల పాటు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాలు నేటితో ముగిశాయి. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కే. కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *