ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలని దర్శి విద్యుత్ ఏడిఈ కే పిచ్చయ్య అన్నారు. ముండ్లమూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోబుధవారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏడిఈ కే పిచ్చయ్య మాట్లాడుతూ … వర్షాకాలంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలన్నారు. గాలులు ఎక్కువగా వీచిన సమయాలలో ఎక్కడైనా కరెంట్ పోల్స్ ఒరిగిపోవడం, తీగలు తెగిపోవడం లాంటి సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యుత్తు బకాయిల వసూళ్ల పై దృష్టి సారించి బిల్లులు చెల్లించే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఏఈ జె భూరాజు, ఎల్ ఐ ఎస్ సాంబయ్య, లైన్ మాన్ లు పీవీ రామాంజనేయులు, బి సోమల నాయక్, షేక్ మాసూమ్ మస్తాన్, జేఎల్ఎంలు పాల్గొన్నారు.
