పథకాల అమలులో నిర్లక్ష్యం తగదు -జేడీఎం దర్శి క్లస్టర్ ప్రత్యే కాధికారి రజనీకాంత్

మహిళలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో వీఓఏలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని జేడీఎం దర్శి క్లస్టర్ ప్రత్యే కాధికారి రజనీకాంత్ అన్నారు. తాళ్లూరు వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో గురువారం వీఓఏలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేడీఎం దర్శి క్లస్టర్ ప్రత్యే కాధికారి రజనీకాంత్ మాట్లాడుతూ… జగనన్న తోడు, బ్యాంకు రుణాలు, సామాజిక పెట్టుబడి నిధి, వైఎస్సార్ చేయూత పథకాలను అర్హులకు అందించడంలో నిర్లక్ష్యం తగదన్నారు. గ్రామాల వారీగా పనితీరుపై సమీక్షించారు. సమావేశంలో ఏరియా కో ఆర్డినేటర్ వసుంధరాదేవి, జేపీవీ ఏపీఎం సుబ్బారావు, కళ్యాణ్, ఏపీఎం దేవరాజు, స్త్రీనిధి మేనేజర్ పవన్ వీఓఏలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *