బీఎల్వీలు బాధ్యతగా పనిచేయాలి – దర్శి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి లోకేశ్వరరావు

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి గ్రామాల్లో బూత్ ల
వారీగా జరుగుతున్న ఓట్ల నమోదు ప్రక్రియలో బీఎల్వీలు బాధ్య తాయుతంగా ఓటర్ల వివరాలను నమోదు చేయాలని దర్శి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి ( ఈఎం అర్ .ఓ )లోకేశ్వరరావు అన్నారు. తాళ్లూరు మండలంలో జరుగుతున్న ఓట్ల పరిశీలన తీరును ఆయన తహసీల్దార్ తో కలిసి పరిశీలించారు. ఇంటిపేర్లు తప్పులు ఉన్నా, ఇంటినంబర్లు తప్పుగా ఉన్నా పరిశీలించి వారు నివాసముండే వార్డులందు నమోదు చేయాలన్నారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు వివిధ వార్డులలో ఉంటే అందరివి ఓకే కుటుంబంలో,ఒకే వార్డులో నమోదు చేయాలన్నారు. ఓటర్ జాబితాలలో ఫొటోలు తప్పులుగా ఉన్నా వాటిని సరిచేస్తామన్నారు. ఇంటింటికి తిరిగే ఎన్నికల సిబ్బంది అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి సరిచేసి ఖచ్చితమైన ఓటర్ లిస్టు సిద్ధం చేయాలన్నారు. స్వయంగా తాళ్లూరు, శివరాంపురం గ్రామాల్లో ఓట్ల నమోదు ప్రక్రి యను పరిశీలించారు. ఓ వ్యక్తి మృతి చెందటంతో ఓటు తొలగించిన ఇంటికి వెళ్లి ఆ ఓటరు ఎన్ని రోజుల కిత్రం చనిపోయాడన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యుల ద్వారా ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.వి.ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పీవీఎస్ ఆర్ మూర్తి, బీఎల్వీ భవాని తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *