పంటల సాగుకు నాగార్జున సాగరు ఆయ కట్టు పరిధిలోని భూములకు నీరు అందించేందుకు అవకాశాలు లేవని మండల వ్యవసాయా ధికారి బి.ప్రసాదరావు తెలిపారు. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు రైతులు వర్షా ధారమైన మెట్ట పంటలనే సాగు చేయాలని సూచించారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాల యంలో శనివారం రైతులకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ విషయమై రైతులను చైతన్య పరుస్తూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తామన్నారు.
