అధిక ప్రోటీన్లతో ఉండే చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు వి. కె జూనియర్ కాలేజీ విద్యార్థులకు చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏవో ప్రసాద్ రావు మాట్లాడుతూ …చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటే రక్తపోటు, కొవ్వును తగ్గిస్తుందని, మధుమేహం, స్థూలకాయం, ఆస్తమా, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని నివారిస్తాయన్నారు. జీవనశైలి సమస్యలు ఎదుర్కోవడంలో సహాయ పడతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆంజనేయులు, లెక్చరర్లు లక్ష్మయ్య, శ్రీధర్, ఏ.ఈ.ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
