దర్శి నియోజక వర్గ వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ పుట్టిన రోజు వేడుకలు అభిమానులు కోళాహాలం మధ్య ఘనంగా నిర్వహించారు.
అభిమానులు దర్శి గడియారం స్తంభం సెంటర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ ను అభిమానులు పూల దండలతో ముంచేత్తారు. కేక్ లు కట్ చేయించి పంచి పెట్టారు. ఆదివారం చలివేంద్రం వెంకటేశ్వరస్వామి కొండ వద్ద, దద్దాలమ్మ గుడిలో డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ సోదరులు మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి వాసులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశినాయన, సాయిబాబ వృద్ధాశ్రమాలలో అన్నదానం నిర్వహించారు. వెంకటరమణ వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి వృద్ధులకు దుప్పుట్ల పంపిణీ చేసారు. ఆరవ వార్డులో మహిళలకు చీరలు పంపిణీ చేసారు.
ఆయా కార్యక్రమాలలో నియోజక వర్గంలోని ప్రజా ప్రతినిథులు దర్శి మాజీ ఎ.ఎంసీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి(మహేష్) దర్శి, ముండ్లమూరు, కురిచేడు ఎంపీపీలు జీఎస్ అచ్చారావు, ఎస్ఎస్ బ్రహ్మానంద రెడ్డి, చంద్రశేఖర్ తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం. ఎన్. పి నాగార్జున రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ వేర్ డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్ వీసీ రెడ్డి, నారాయణ రెడ్డి, తాళ్లూరు మండల పార్టీ కార్యదర్శి యాడిక యలమందా రెడ్డి, మాజీ ఎఎంసీ డైరెక్టర్ మిల్లర్ బుజ్జి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, గంగిరెడ్డిపాలెం ఎలమందరెడ్డి ,గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (చందన), తాళ్లూరు మండల జెసిఎస్ కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి , సర్పంచిలు చిమటా సుబ్బారావు, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎం. బ్రహ్మా రెడ్డి, మాజీ సర్పంచిలు పులి క్రిష్ణా రెడ్డి, గుంటి గంగ దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం, కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్ కొర్రపాటి విష్ణు తదితరులు పాల్గొన్నారు.









