ఒంగోలు నగరంలో ఎన్నో
దశాబ్దాలుగా నెలకొని ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నట్లు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో 33,34,35,36,డివిజన్ లలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు పలు రకాలైన ధ్రువీ కరణ పత్రాలు అధికారులు ఎమ్మెల్యే బాలినేని చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే కృత నిశ్చయము తో జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలురకాల ధ్రువీకరణ పత్రాలను వెంటనే అందిస్తున్నారు. కానీ గతంలో ప్రజలు ఈ పత్రాల కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడేవారని, నేడు ఆ స్థితి లేకుండా సురక్ష కార్యక్రమం ఎంతో ఉపయుక్తం గా ప్రజలకు ఉందని తెలిపారు.
ఇటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఒంగోలు నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని,అందుకే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి తో మాట్లాడి దాదాపు 370 కోట్ల రూపాయలు పైనే నిధులను తీసుకొని వచ్చానని, శాశ్వతంగా తాగునీటి సమస్యను తీరుస్తున్నట్లు తెలిపారు.
—పేదలందరికి పట్టాలు ఇస్తా
ఒంగోలు నగరం లో పేదలందరికి పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేస్తాం అని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. ఎర్రజర్ల వద్ద స్థల సేకరణ చేస్తే టి డి పి వారు కోర్ట్ కి వెళ్లి అడ్డున్నారని ధ్వజం ఎత్తారు. జాప్యం అవుతుండడంతో ముఖ్యమంతి గారితో మాట్లాడి దాదాపు 200వందల కోట్లు నిధులతో స్థలం సేకరించినట్లు తెలిపారు. దాదాపు 28వేలమందికి త్వరలో అందజేస్తామని తెలిపారు.
—వాలంటీర్ల పై నిందలు మంచిది కాదు
ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై నిందలు వేశారని అది మంచిది కాదని ఖండించ్చారు. కరోనా సమయంలో కూడా వాళ్లు ప్రజలకు చేసిన సేవలు విస్మరించి నేడు అవమానవీయంగా మాట్లాడడం సభ్యత కాదని హితవు పలికారు.
—త్వరలో డయల్ యువర్ ఎమ్మెల్యే
త్వరలో సత్య కేబుల్, వి కేబుల్ ద్వారా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బాలినేని పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తీర్చడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అన్నారు. రెండు వారాల్లో సమస్య ను అధికారుల చేత పరిష్కరిస్తాం అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
