ముండ్లమూరు మండలంలోని వేంపాడు చిలకలేరు వద్ద అదుపు తప్పి కూరగా యల లోడ్తో వెళుతున్న మినీ లారీ బోల్తా పడింది. ఈప్ర మాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మంగళవారం గుంటూరు నుంచి మార్కాపురం వెళుతున్న మినీ లారీ దర్శి – అద్దంకి ప్రధాన రహదారిలో వేంపాడు చిలకలేరు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించ బోయి అదుపు తప్పి రోడ్డు మార్జిన్లో బోల్తా పడింది.
