నాగార్జునసాగర్ కాలువకు విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమేనని ఎన్ఎస్పీ ఈఈ వెంకటరాజు తెలిపారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నీటిని విడు దల చేసినట్లు చెప్పారు. జిల్లాలోని నోటిఫైడ్ చెరువులు నింపుకునేందుకు ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాగర్ జలాలు బుధ వారం ఒంగోలు బ్రాంచ్ కాలువ హెడ్ రెగ్యులేటర్ దర్శికి చేరాయి. ఈ సందర్భంగా ఆయన కాలువను పరిశీలించి వివరాలు తెలిపారు. సాగర్ జలాలను రైతులు పొలాలకు వినియోగించవద్దని, కేవలం తాగునీటి కోసమేనని రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఆయన వెంట దర్శి, కురి చేడు డీఈఈలు అక్బర్ భాష, ఆంజనేయప్రసాదు, జేఈలు, సిబ్బంది పాల్గొన్నారు.



