ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలపై యాజమాన్య పద్ధతులపై రైతులకు గురువారం అవగాహన కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్వీవీ ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్వీవీ ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజస్థాన్ లోని శిఖర్ ప్రాంతంలో పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం చేపట్టారన్నారు. రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు చెప్పారు. డాక్టర్ ఎం.ఉషా, డాక్టర్ ఎం.శివ, డాక్టర్ టీవీ రెడ్డి, డాక్టర్ ఎన్. లీలాకృష్ణ, టి.మానస, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డి.కోటే శ్వరరావు, జి.నాగమణి పాల్గొన్నారు.


