రైతులు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి తాము సాగుచేసిన పంటలను ఈ- క్రాస్ నమోదు చేసుకోవాలని దర్శి వ్యవసాయాధికారి బాల క్రిష్ణా నాయక్ కోరారు. బసి రెడ్డి పల్లె రైతు భరోసా కేంద్రాన్ని వ్యవసాయాధికారి శుక్రవారం సందర్శించారు. రైతు భరోసా కేంద్రాలలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కలసి, తమ పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంకు బుక్ జిరాక్స్ ను అందించి 2023 సంవత్సరంలో సాగు చేసిన పంటలను నమోదు చేయించుకోవాలని కోరారు. గ్రామ ఉద్యాన సహాయకులు జాన్ గోర్డాన్, సాయి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు

