తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జడ్పీహైస్కూల్ నందు శుక్ర వారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశించి లాబొలేటరీ గదితాళాలు పగుల గొట్టి సామాగ్రిని ద్వంసం చేశారు. వివరాల్లోకి వెలితే.. జిల్లా పరిషత్ హైస్కూల్ లో గల లాబొలేటరీ తలుపుతాళాలు పగలగొట్టిలోనికి ప్రవేశించారు. ల్యాబ్లో ని సామాగ్రినంతా ద్వం సం చేశారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం సురేష్ శనివారం ఉదయం పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఆరు నెలల క్రితం కూడా పాఠశాలకు చెందిన ల్యాప్టాప్ లు దొంగతనానికి గురైనట్లు తల్లిదండ్రులు చెప్పారు అయితే తరచూ పాఠశాలలో ఇలా జరగడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా పోలీస్ సిబ్బంది స్పందించి తగిన చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
