జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి – ప్రభుత్వం మీద బురదజల్లే పెట్టుకున్న ఒక వర్గం పత్రికలు – సీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్లో వర్కింగ్ జర్నలిస్టులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని జర్నలిస్టులకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేం దుకు ప్రతి శనివారం జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టులు పుస్తక పఠనంతో పాటు రచనలు కూడా చేయాలని, తమలోని ప్రతిభను వెలికితీసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుం డాలన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య శ్రీ కింద వైద్య చికి
త్సలు అందించేందుకు తాను ఆరోగ్య శ్రీ ట్రస్టు  చైర్మన్ తో మాట్లాడి హెల్ప్ లైన్ 104 నంబరులో ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. జర్నలిస్టుల రచనలు గ్రంథా లయాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని గ్రంథాలయ పరిషత్ కమిషనర్ చేంజ్ కోరగా అంగీకరించారని చెప్పారు. మార్కాపురంలో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాను ఏ పత్రికనైనా ఫలానా వార్త రాయవద్దని చెప్పననీ, అయితే రాష్ట్రంలో ఒక వర్గం పత్రికలు ప్రభుత్వంపై బురదజల్లేలా రాతలు రాస్తున్నాయని అన్నారు. తెలం గాణలో వర్షాలు పడితే ఒక రకంగా, మన రాష్ట్రంలో
వర్షం పడితే మరోలా అవే పత్రికలు వార్తలు రాయడాన్ని ఆయన ఆక్షేపించారు. ఎప్పటికప్పుడు పాత్రికేయులు సమాజంలో వస్తున్న మార్పులను గుర్తించాలని సూచించారు. రచనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు కె ఎస్ ఆర్ ను ఘనంగా సన్మానించారు.
*లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవా లయంలో పూజలు* … లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో కేఎస్ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెలిగొ డ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపడియ, సుంకేశుల గ్యాప్ లను సందర్శించారు. ఆయన వెంట సీనియర్ పాత్రి యులు ఓఎ మల్లిక్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల మోహన్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఐజేయూ సభ్యులు రమణ, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *