దర్శి రూపురేఖలు మార్చేస్తాడని భారీ మెజారిటీతో మీరు మద్దిశెట్టి వేణుగోపాల్‌ని గెలిపించారు. దర్శి అభివద్ధి చెందిందా? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వేణుగోపాల్ జీవితం మా మారిపోయింది. హైదరాబాద్ లో రూ.7 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు. దర్శి నియోజకవర్గంలో 80 ఎకరాల భూమి కొన్నాడు. మార్టూరులో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నాడు. దర్శిని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడు. అందుకే ఆయన పేరు మార్చా.. ఆయన పేరు వేణుగోపాల్ కాదు కలెక్షన్ గోపాల్.. తమ్ముడు శ్రీధర్ తో పాటు ఐదు మండలాలకు ఐదుగురు బంధువులను కలెక్షన్ ఏజెంట్లుగా నియమించాడు.’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ముండ్లమూరు సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2019లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసిపి ఎనిమిది సీట్లు గెలిచిందని, టిడిపి ఎమ్మెల్యేని కూడా పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. పార్టీ లో ఎన్నో పదవులు అనుభవించి కొంత మంది పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని, వాళ్ళందరికీ థాంక్స్ అని వారు వెళ్లిపోయిన తర్వాత పార్టీ బలోపేతం అయ్యిందని పేర్కొన్నారు. వైసిపికి ఇప్పుడు 9మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అంటే జిల్లా అభివద్ధిలో దూసుకెళ్ళాలి కదా.. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకి జగన్ పీకింది ఏమిటని ప్రశ్నించారు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా..? అని అడిగారు. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేశామని, ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయిందన్నారు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం
అటకెక్కించిందన్నారు. 12 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడని, అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేదని అన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చర్చకు రావాలని, ఎవరి హయాంలో ప్రకాశ అభివద్ధి చెందిందో చర్చకు తాను రెడీ అని చెప్పారు. బోదనంపాడు గ్రామంలో సర్వే నెం. 227 లో దళితులకు చెందిన 25 ఎకరాల భూమిని కలెక్షన్ గోపాల్ కబ్జా చేశాడన్నారు. పోలవరం ఇసుక రీచ్ ల నుండి కోట్లాది రూపాయలు ఇసుకను కలెక్షన్ గోపాల్ దోచేస్తున్నాడని చెప్పారు. దోపిడీలో కలెక్షన్ గోపాల్ రూటే సెపరేటన్నారు. దర్శిలో ఏ అధికారినీ ఎక్కువ కాలం పనిచెయ్యనివ్వడన్నారు. ఎందుకంటే ఎస్సై పోస్టు బదిలీకి రూ.15 లక్షలు సిఐ 20 లక్షలు, తహశీల్దారికి రూ.20 లక్షలు వసూలు చేస్తాడన్నారు. వైసిపి సర్పంచులు, కార్యకర్తలను కూడా వదలడం లేదన్నారు. ఏ అభివద్ధి కార్యక్రమం జరగాలన్నా లక్షకు 10 వేలు కమిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్నా కలెక్షన్ గోపాల్ కి కప్పం కట్టాల్సిందేనన్నారు. సర్పంచ్, ఎంపిటిసికి రూ. 20 లక్షలు, ఎంపిపి, జెడ్పిటిసిలకు రూ.30 లక్షల నుండి కోటి రూపాయల వరకూ రేటు పెట్టి అమ్మేశాడన్నారు. సింగిల్ విండో, ఏఎంసి ఛైర్మెన్ పదవులు వేలం వేసి అమ్మేశాడని చెప్పారు. జనాలు ఉండలేని చోట సెంటు స్థలాలు ఇచ్చి లెవెలింగ్ పేరుతో రూ.3 కోట్లు కొట్టేశాడన్నారు. దర్శిలో ఎవరు వెంచర్ వెయ్యాలన్నా ఎకరానికి రూ.5 లక్షలు కప్పం కట్టాల్సిందేనన్నారు. కలెక్షన్ గోపాల్ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకి ఎక్స్ పోర్ట్ చేస్తాడని, బల్లు ఖాళీగా రాకుండా వచ్చేప్పుడు ఇతర రాష్ట్రాల లిక్కర్ తెప్పిస్తాడని ఆరోపించారు. కలెక్షన్ గోపాల్ చేసిన అవినీతి మొత్తం చెప్పాలి అంటే ఒక రోజు పడుతుందన్నారు. గ్రామాలు, మండలాల వారీగా దోపిడీ వివరాలు త్వరలోనే మా నాయకులు ప్రెస్మీట్లు పెట్టి చెబుతారని చెప్పారు. దర్శి లో టిడిపి జెండా ఎగరేయాలని, దర్శి చరిత్ర లో ఎప్పుడూ జరగని అభివద్ధి చేస్తామని తెలిపారు. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఎయిర్పోర్ట్ అభివద్ధి చేస్తామని చెప్పారు. దర్శిలో ఇంటర్నేషనల్ స్కూల్ ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యకర్తలే టిడిపికి ఇంచార్జ్ అని..ఇన్చార్జి లేకపోయినా సరే సభను సెక్స్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
