లోకేష్ అజ్ఞానాన్ని చూసి బాబు నిత్యం ఏడుస్తుంటాడు – సన్నాఫ్‌ చంద్రబాబు తప్ప లోకేశ్‌ అర్హతేంటి. -రాజకీయాల్లో కామెడి పీస్ లోకేష్-నాపై అల్లాటప్పా ఆరోపణలు చేసిన లోకేష్ -నేనేదో కోట్ల ఆస్తులు సంపాదించానని లోకేష్ ఆరోపిస్తున్నాడు– నా కంపెనీల్లో ఉద్యోగులకు జీతమే నెలకు రూ. 10 కోట్లు ఇస్తున్నా-రూ. వేల కోట్లతో వ్యాపారం చేస్తున్నా.. వందల కోట్లు ట్యాక్స్ కడుతున్నా-మీలా చిల్లర డబ్బులకు కక్కుర్తిపడే వాడిని కాదు- ఆస్తులపై నేను చర్చకు సిద్ధం.. దర్శికి వస్తావా లోకేష్-ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్‌ సవాల్

తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే  డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*సన్నాఫ్‌ బాబు తప్ప లోకేశ్‌ అర్హతేంటి..?ః*
లోకేశ్‌ యువగళం పేరుతో నిన్న దర్శి నియోజకవర్గంలో పర్యటించి నామీద, మా పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు చేశాడు. ఆయన తండ్రి ఎంత పైకి తీసుకురావాలని తపిస్తునా.. కనీసం ఒక మెట్టు కూడా పైకిరాలేని వ్యక్తి ఈ లోకేశ్‌. అలాంటి వ్యక్తి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. సన్నాఫ్‌ చంద్రబాబు తప్ప లోకేశ్‌కున్న కేరాఫ్‌ ఏంటి..? ఆయనకున్న రాజకీయ అర్హతేంటి..? రాజకీయాల పట్ల సరైన అవగాహన లేని వ్యక్తి మా గురించి దర్శిలో మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఆయన చేసిన ఆరోపణలన్నింటినీ మేం ఖండిస్తున్నాం.  ప్రకాశం జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి, చదువుకుని అమెరికాలో అత్యున్నత విద్యాభ్యాసంతో అక్కడ్నే కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేసి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకోవాలనే తపనతో వచ్చాను. అప్పుడు మా నాయకుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నన్ను పిలిపించి పార్టీ సీటిస్తే ఎమ్మెల్యేగా గెలిచి దర్శి నియోజకవర్గ ప్రజల ఆదరణ పొందుతున్నాను. మరి, ఎలాంటి రాజకీయ అనుభవం, కష్టం తెలియని లోకేశ్‌ నన్ను ఎలా తూలనాడతాడు..? బాబు కేరాఫ్‌ లేకపోతే ఈ లోకేశ్‌ను ఎవడైనా పట్టించుకుంటాడా..? ఎవడో చెప్పిన అబద్ధపు మాటల్ని చదవడానికే నిన్న ఆయన దర్శిలో తిరిగాడు.

చంద్రబాబు తన కొడుకు పరిస్థితిని చూసి నిత్యం కుళ్లికుళ్లి ఏడుస్తుంటాడు. తాను ఎంతగా పైకి తేవాలని ప్రయత్నించినా.. ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాడని లోకేశ్‌ విషయంలో బాబు బాధపడుతున్నాడు. అదే దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తనయునిగా మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రచరిత్రలోనే 151 స్థానాల్ని గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర పరిపాలనలో ఈరోజు తండ్రిని మించిన తనయునిగా విశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఎక్కడైనా కొడుకులు ఎదిగితే తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూస్తారు గానీ.. లోకేశ్‌ విషయంలో బాబు కన్నీళ్లను చూడాల్సిన పరిస్థితిని మనమందరం గమనిస్తున్నాం.

*నా ఆస్తులపై ఆధారాలతో చర్చకు సిద్ధంః*
ప్రకాశం జిల్లాలో నాకేదో అక్రమ ఆస్తులున్నాయంటూ లోకేశ్‌ ఆరోపించిన దానిలో ఎక్కడా వాస్తవాల్లేవు. ఆయన చెప్పే క్వారీలు, మిగతా ఆస్తులన్నీ ఎప్పుడో మా కుటుంబానికి ఉన్న ఆస్తులే. 2006లోనే మాకు అనేకచోట్ల ఆస్తులున్నాయి. అవన్నీ మా కష్టార్జితంగా వ్యాపారాలు చేసి మరీ కొనుగోలు చేసినవే. అన్నింటికీ అధికారపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి. మేం ఎక్కడా అక్రమంగా సెంటు భూమిని కూడా కబ్జా చేయలేదు. కొన్నేళ్లుగా ఇన్‌కంట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు కొన్ని రూ.వందల కోట్లు ట్యాక్స్‌ కడుతున్నానంటే మాకున్న ఆస్తుల విలువ తెలిసిపోతుంది. హైదరాబాద్‌లో రూ.7 కోట్ల విలువైన విల్లా ఉందంటున్నావు. మరి, బెంగుళూరు వచ్చి చూడు. నేనక్కడ రూ.30 కోట్ల విలువైన పెద్ద విల్లా కట్టుకుని ఉంటున్నాను. అది 2013లో కట్టుకున్న ఇల్లు. అలాంటి నా మీద లోకేశ్‌ చిల్లరమల్లర ఆరోపణలతో దుర్భాషలాడటం తగదని హెచ్చరిస్తున్నాను. 2008లో  రూ.కోట్లు వెచ్చించి ప్రకాశం జిల్లాలో ఒక ఇంజినీరింగ్‌ కాలేజీ కూడా కట్టాను. అందులో ఈరోజు 6వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా ప్రతిభ గలిగిన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న కాలేజీ మాది. నీవంటున్న పొలాలు కూడా మాకున్నాయి. మాకు ఎక్కడా అవినీతికి పాల్పడాల్సిన అవసరంలేదు.  నా కంపెనీలలో దాదాపు 4వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి జీతాల కింద నెలకు రూ.10 కోట్లు ఇస్తున్నాను.  నా ఆస్తులకు సంబంధించి అన్ని ఆధారాలతో వస్తాను. లోకేశ్‌ నాతో చర్చకు దర్శి రాగలడా..? అని సవాల్ చేస్తున్నాను.

*రాజకీయాల్లో కామెడీ పీస్ లోకేశ్ః*
రాజకీయమనేది సీరియస్‌నెస్ తో, ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన, ఆశయాలతో ముందుకు సాగేది. అలాంటి రాజకీయాల్లో లోకేశ్‌ ఒక జోకర్‌గా మారి కామెడీ పర్యటనలు చేస్తున్నాడు. ప్రతీ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడ నేతలపై బురదజల్లే ఆరోపణలు చేయడం, అబద్ధాలతో వ్యక్తిగతమైన విమర్శలు చేయడమే కనిపిస్తుంది. అతని మాటలు చాలా కామెడీగా ఉన్నాయంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. కేవలం చంద్రబాబు కొడుకు అని మాత్రమే ఆయన్ను ఒకరిద్దరూ అనుసరిస్తున్నారేమో గానీ.. బాబు కేరాఫ్‌  లేకపోతే టీడీపీ ఎంట్రన్స్‌ గేటులోపలికీ రానిచ్చేవాళ్లు కాదు.

*ఫిల్టర్ బెడ్లు చనిపోయాయంటున్న మాలోకం లోకేశ్ః*
మేం ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల నేతలు కూడా పర్యటించవచ్చు. ఇక్కడి అభివృద్ధి పనులను పరిశీలించుకోవచ్చు. అంతేగానీ, నియోజకవర్గాల్లోకి వెళ్లి అక్కడ స్థానిక నేతల్ని ఏమాట పడితే ఆ మాటతో తిట్టడం, మా పార్టీ పెద్దల్ని దూషించడం లోకేశ్‌కు ఎంతవరకు సబబని అడుగుతున్నాను. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై విశేష ప్రజాదరణ లభిస్తోందని చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌కు కన్నుకుట్టినట్లుంది. మా నాయకుడి పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు డీబీటీ ద్వారా రూ.2. 25లక్షల కోట్లు లబ్ధిని సంక్షేమ పథకాల రూపంలో అందించారు. మరి బాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి ఏంటి..? అని ప్రశ్నిస్తున్నాను. మీ హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ.. రాబోయే కాలంలో ప్రజలకేం చేస్తారో వివరించుకోవాలి గానీ మమ్మల్ని తిట్టడానికే పర్యటనలు పెట్టుకోవడమనేది రాజకీయాల్లో విడ్డూరంగా కనిపిస్తుంది. చంద్రబాబో, మరెవరో ఇచ్చిన స్క్రిప్టును చదువుతూ లోకేశ్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. అదైనా తప్పుల్లేకుండా చదవడం రాదు. ఫిల్టర్‌బెడ్‌లు చెడిపోవడాన్ని చనిపోయాయంటాడు. మేం అధికారంలోకి రాగానే ఫిల్టర్‌బెడ్‌లు రిపేర్‌ చేస్తామంటాడు.  దొనకొండ ఎయిర్‌స్ట్రిప్‌పైన కూడా లోకేశ్‌ అవగాహన లేకుండా దాన్ని ఎయిర్‌పోర్టుగా చెబుతున్నాడు. వారి పార్టీ తరఫున అధికారంలోకొస్తే ప్రజలకేం చేస్తారో చెప్పలేని అజ్ఞాని ఈ లోకేశ్‌.

*మా హయాంలోనే దర్శి అభివృద్ధిః*
దర్శి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో ఇంతకు ముందెవరూ స్థానికంగా ఉండేవాళ్లు కాదు. అలాంటిది, నేను స్థానికంగా నివాసం ఉంటూ దర్శి నియోజకవర్గాన్ని కొన్ని రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధిలోకి తెచ్చాను.  టీడీపీ హయాంలో దర్శి అభివృద్ధి సున్నాగా చెప్పుకోవచ్చు. మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా ఉండి కూడా దర్శి, కురిచేడు రోడ్డును అభివృద్ధి చేయలేకపోయాడు. రోజుకు రెండుమూడు రోడ్డు ప్రమాదాలు జరిగే ఆ రోడ్డును రెండులేన్ల రహదారిగా మార్చడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది వాస్తవం కాదా.? అలాంటిది, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేనొక ఎమ్మెల్యేగా ఆరోడ్డు అభివృద్ధిపై మా నాయకుడు జగన్‌గారి దృష్టికి తీసుకెళ్లి రూ.25 కోట్లతో రెండులైన్ల రహదారిగా మార్చాం. నియోజకవర్గంలో రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, రూ.121 కోట్లు శాంక్షన్‌ చేయించుకున్నాను. రేపో ఎల్లుండో టెండర్లు కూడా పిలుస్తున్నాము.

*నామీద నిలబడి పోటీచేసే దమ్ముందా..?ః*
దర్శి నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఇంచార్జి కూడా ఎవరూ లేరనుకుంటున్నాను. లోకేశ్‌నే ఈ నియోజకవర్గ ఇంచార్జిగా ఉండి రాబోయే ఎన్నికల్లో నామీద నిలబడి పోటీచేసే దమ్ముందా..? అని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మేం దర్శికి చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు కనుక మా ప్రాంత ప్రజలు కూడా రేపటి ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా.. మళ్లీ వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించాలని ఎదురుచూస్తున్నారు. బటన్‌ నొక్కి టీడీపీని మరోమారు ఇంటికి పంపేందుకు ప్రజలు ఆసక్తితో ఉన్నారు. ఎటూ వయసైపోయిన నాయకుడిగా చంద్రబాబు ఉంటే.. 2029లో లోకేశ్‌ కి అడ్రస్ కూడా ఉండదు. ఇప్పటికైనా వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై మాట్లాడేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించి, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని హెచ్చరిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *