ప్రజల అభిమాన ధనుడు, కార్యదీక్షా పరుడు, పేదల పాలిటి పెన్నిది దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్. మారుమూల పల్లెటూరులో జన్మించిన మద్దిశెట్టి కుటుంబం స్వయం కృషితో అకుంఠిత దీక్షతో ఉన్నత విద్యను అభ్యసించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు పేస్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. దేశ, విదేశాలలో అంతర్జాతీయ కాంట్రాక్టర్ గా గుర్తింపుతెచ్చుకున్న మద్దిశెట్టి పేద ప్రజలకు సేవ చెయ్యాలన్న లక్ష్యంతో రాజకీయ అరగ్రేటం చేసారు. వారి కోరిక 2019లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు దర్శి నియోజక వర్గంలో ఉద్దండులపై పోటీకి సిద్ధమై దర్శి చరిత్రలో రికార్డు మెజార్టీ స్వంతం చేసుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుండి ప్రజల సేవకు నిత్యం ప్రజలతో మమేకమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా నిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ దర్శిని అభివృద్ధిలో ముందు నడిపిస్తున్నారు. జగనన్న మానస పుత్రిక సచివాలయ వ్యవస్థను సజావుగా సాగేందుకు అవసరమైన సచివాలయాలను, వైఎస్సార్ ఆర్బికేలను, హెల్ క్లినిక్ ను జిల్లాలో అధిక సంఖ్యలో నిర్మించి మన్ననలు పొందుతున్నారు. జగనన్న సురక్ష ద్వారా పేద ప్రజలకు సహకారం అందించడంలో ముందున్నారు.
దర్శి ప్రజల చిరకాల కోరిక అయిన మున్సిపాలిటిని సాధించారు. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి పేద, మహిళలను డిగ్రీని అందుబాటులోనికి తెచ్చిన ఘనత, దర్శి కురిచేడు రోడ్డు డబల్ రోడ్డుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా చేశారు. దర్శిలో విద్యుత్తు ఈ కార్యాలయం ఏర్పాటు, జల జీవన్ మిషన్ ద్వారా నీటి సమస్య తీర్చడంలో తీసుకున్న చొరవ తో ప్రజల కష్టాలు తీర్చిన ఘనత ఎమ్మెల్యే మద్దిశెట్టికే దక్కుతుంది. వైద్యశాల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు అన్ని పంచాయితీలలో మౌళిక వసతులు అభివృద్ధి, జల జీవన్ మిషనతో పాటు అనేక కార్యక్రమాలు పేద ప్రజల అవసరాలకు చేపడుతూ, నిత్యం అలుపేరగక ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తూ పేద ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని వారిలో ఒకరు అవుతున్నారు. ఏదైనా పనిని పట్టుకుంటే నిత్యం సాధించే వరకు నిద్ర పోని మనస్తత్వం ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెటి వేణుగోపాల్ దర్శిని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు నిత్యం కృషి చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాట ఇస్తే శత్రువును అయినా సరే దగ్గరకు తీసి వారి బాగోగులు అడిగి తెలుసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడే మనస్తత్వం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ స్వంతం. విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా సూక్ష్మంగా గ్రహించి సమస్యను తక్షణం పరిష్కరించే పరిజ్ఞానం డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కి దేవుడు ఇచ్చిన వరం. ఆయన పుట్టిన రోజు పండుగను కార్యకర్తలు పెద్ద పండుగ వలే జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. అందరి వాడుగా ప్రజా అభిమానం పొందుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ… జర్నలిస్ట్ డిజిటల్ మీడియా ( జే ఎస్ డి ఎం) తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. 🎂💐💐

