పెరటికోళ్ల పెంపకంపై
అవగాహనతో అధిక అధిక లాభాలు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ వీవీఎస్ దుర్గాప్రసాద్ సూచిం చారు. షెడ్యూల్ కులాలు ఉపప్రణా ళిక కింద రైతులకు కోళ్ల పెంపకంపై బుధవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ వీవీఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ …ఎస్సీ, ఎస్టీ రైతులు ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిచ్చే ఉద్దేశంతో రైతులకు పెరటికోళ్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం పెరటికోళ్లను పరిశీలించారు. పశువైద్యురాలు డాక్టర్ లీలాకృష్ణ, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం ఉష, డాక్టర్ ఎం శివ, డాక్టర్ టి.వి రెడ్డి , మానస, ఓబి అర్ సిబ్బంది కోటేశ్వరావు తదితరులు పాల్గొ న్నారు.

