తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దారం వారి పాలెంలో వైఎస్సార్ కంటివెలుగు, పలు ఆరోగ్య కార్యక్రమాలను జిల్లా వైద్యాధికారి ఎస్ రాజ్యలక్ష్మి శనివారం పరిశీలించారు. 176 మంది వృద్ధులకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించి 66 మంది సభ్యులకు శుక్లం ఆపరేషన్లు నిర్వహించటానికి గుర్తించారు. అన్ని జాతీయ కార్యక్రమాలను సమీక్షించి రికార్డులను పరిశీలించారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, పీ ఎం ఓ ఉమా ,ఎం పీయూ కె. శ్రీనివాస్, ఎల్ఎల్ హెచ్పీ మంగా బాయి, ఆరోగ్యకార్యకర్త మేరీ, హెల్త్ అసిస్టెంట్ బాల సుబ్రమణ్యం, 104 సిబ్బంది డి.యూ నిరంజన్, పైలట్ రవి వర్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

