అక్రమ సంబంధం మోజులో ఆత్మ హత్య చేసుకున్న శ్రీనివాసరావు ప్రేమకధ లో ఆశక్తిగల విషయాలు -పురుగుమందు తాగిన శ్రీనివాసరావు మృతిచెందినట్లు, శవ పంచనామా జరిగినట్లు తనకు సమాచారం లేదని భార్య కృష్ణవేణి గగ్గోలు-భార్య భర్తల చివరి ఫోన్ కాల్ సంభాషణలో, మధ్యవర్తుల ప్రమేయంతో శ్రీనివాసరావు ప్రియురాలు శ్రావణి కి తాళి కట్టిన వైనం.

(JSDM బాపట్ల ప్రతినిధి):
బాపట్ల జిల్లా అద్దంకి మండలం లోని శంకవరప్పాడు లో జులై 23వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యకి పాల్పడిన కొమ్మాలపాటి శ్రీనివాసరావు (35) గత నెల 31వ తేదిన మృతిచెందినాడు.
అందిన వివరాల ప్రకారం శ్రీనివాసరావు కి మూడు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. వీరి వివాహానికి ముందు అదే గ్రామానికి చెందిన శ్రావణి అనే మరో యువతితో శ్రీనివాసరావు కు కొన్నాళ్ళ పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. వీరి ప్రేమ విషయం అప్పట్లో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

క్రిష్ణవేణి తో వివాహం జరిగిన తరువాత శ్రీనివాసరావు అద్దంకిలో కార్ షెడ్ నిర్మించుకొని, అద్దంకిలోనే నివాసం ఉంటున్నారు. తక్కువ కాలంలో ఆర్ధికంగాఎదుగుతున్న శ్రీనివాసరావు ని చూసి ఓర్వలేని కొందరు మధ్యవర్తులు తన మాజీ ప్రియురాలు శ్రావణి తనను కోరుకుంటుందని, మీకు వివాహం జరిగి 3సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగలేదని, భార్యా కృష్ణవేణి తో విడాకులు తీసుకోవాలని, మధ్యవర్తులు బేబీ,శ్రీను,సరస్వతి,అనువారలు శ్రీనివాసరావును నమ్మబలికించి ఆశ కల్పించి,గతంలో గొడవలతో ముగిసిన మాజీ ప్రియురాలిని, శ్రీనివాసరావును మధ్యవర్తుల సొంత గృహల్లోనే వారిద్దరు కలుసుకునేందుకు కారకులయ్యారు. మధ్యవర్తులు అంతటితో ఆగలేదు. 3నెలల క్రితం అదే మధ్యవర్తులు ముగ్గురు సమక్షంలో శ్రావణితో శ్రీనివాసరావుకి వివాహం కూడా జరిపించారు.

  విషయం తెలుసుకున్న భార్య కృష్ణవేణి భర్త శ్రీనివాసరావుతో గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యా భర్తల చివరి ఫోన్ కాల్ సంభాషణలో నేను శ్రావణి ని పెళ్లి చేసుకున్నాను. మనం ముగ్గురం కలిసి ఉండాలని భార్యా తో చెప్పినాడు. భార్య కృష్ణవేణి ఒప్పుకోకపోవటంతో, భార్యను నమ్మకంగా పుట్టింటిలో వదిలి పెట్టి నేను హైదరాబాద్ వెళుతున్నాను కొన్నిరోజులు నేను రావటం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త వెళ్లినతరువాత రెండు నెలల వరకు భార్యతో మాట్లాడని శ్రీనివాసరావు, భార్య ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టి మధ్యవర్తుల ద్వారా ప్రియురాలు తో మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఫోన్ మాట్లాడటం లేదని, తనని తీసుకువెళ్లలేదని భార్య జులై 22వ తేదిన అద్డంకి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. భార్య పిర్యాదు చేసింది అని తెలుసుకున్న ప్రియురాలు శ్రావణి కుటుంబసభ్యులు, తన కుమార్తె శ్రావణి ని మత్తుమందు ఇచ్చి బలత్కరించాడు అని వారుకూడా పోలీస్ స్టేషన్ లో అదేరోజు పిర్యాదు చేశారు. పోలీస్ వారు శ్రీనివాసరావు కి స్నేహపూర్వకమైన కౌన్సిలింగ్ ఇచ్చి మరలా రేపు కుటుంబ సభ్యులతో రావలని చెప్పినారు.
   భార్య, ప్రియురాలు ఒకేరోజు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తారు అని ఊహించని శ్రీనివాసరావు, ఎందుకు ఇలా జరిగింది అని మధ్యవర్తులైన  బేబీ,శ్రీను,సరస్వతులను విచారించగా, తమపై ఆరోపణలు వస్తున్నాయంటూ, శ్రావణిని కలవటం కుదరదు అని ఫోన్లు కట్ చేయటంతో, మనస్థాపం చెందిన శ్రీనివాసరావు సొంత మొబైల్ ఫోన్ లో వీడియో పెట్టి భార్యా, ప్రియురాలుతో కలిసి ఉండాలని, అది జరగని కారణంగా నేను పురుగుమందు తాగి ఆత్మహత్య చేస్తుంకుంటున్నాను అని, నా చావుకి వేరే ఎవ్వరూ కారణం కాదని ఆ వీడియో గ్రామ సామాజిక వర్గ వాట్సాప్ గ్రూప్ లో రెండు వీడియోలుగా తీసి పెట్టి పురుగుమందు తాగుతున్నాను అని వివరించాడు.
    సమాచారం తెలుసుకున్న   గ్రామంలోని బంధువులు, యువకులు శ్రీనివాసరావు ని అద్దంకి ఆసుపత్రి కి తరలించి, అక్కడినుండి ఒంగోలు కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికత్స పొందుతూ శ్రీనివాసరావు జులై 31వ తేదీన మృతి చెందినాడు. ఇంత జరుగుతున్నా భార్యకు కొంచం కుడా సమాచారం ఇవ్వలేదని, ఒంగోలు లో ఉన్నప్పుడు ఒకసారి, గుంటూరు లో ఉన్నప్పుడు మరోసారి వెళ్లినా, తన భర్తని చూడనివ్వలేదని, తన భర్త మరణించిన విషయాన్ని, తరువాత పోస్ట్ మార్టం జరిగిందన్న విషయాన్ని కూడా తనకు తెలియనియలేదని కన్నీరు మున్నీరుగా విలపించింది. 

ఈ విషయంలో తన భర్త మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *