ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామం లో శ్రీ మారం వారి అంకమ్మ తల్లి దేవాలయం లో అంకమ్మ తల్లి కొలుపులు జరిగి సంవత్సరం పూర్తి అయినా సందర్బంగా అంకమ్మ తల్లి కి మొదటి వార్షికోత్సవం సందర్భంగా పొంగళ్ళు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మారం వంశస్థులందరూ అంకమ్మ తల్లి గుడి వద్దకు విచ్చేసి అంకమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకుంటూ కార్యక్రమాన్ని కనుల పండగ గా ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమం లో వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి దంపతులు మొదట గా అంకమ్మ తల్లి దేవాలయం లో జరిగిన పూజ కార్యక్రమం లో పాల్గొని అనంతరం అన్నదానం కార్యక్రమం ను ప్రారంభించారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో తాళ్లూరు మండలం జడ్పిటిసి సభ్యులు మారం వెంకారెడ్డి , మారం లక్ష్మిరెడ్డి, సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి, మారం వెంకటేశ్వర రెడ్డి,మారం నాగిరెడ్డి, మారం కాశిరెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, మారం సుబ్బారెడ్డి,చిమకుర్తి మాజీ ప్రెసిడెంట్ మారం వెంకటేశ్వర రెడ్డి, దశరథ రామిరెడ్డి, మారం వెంకటేశ్వర రెడ్డి పంతులు, మారం రమణారెడ్డి, మారం సుబ్బారావు, మారం గోవింద్ రెడ్డి, మారం కోటేశ్వరరెడ్డి (రజానగరం) ,మారం అంకమ్మ తల్లి దేవస్థానం కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.


