మల్కాపురం పంచాయితీ పరిధిలోని రజానగరంలో నాగార్పమ్మ గుడిలో వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గుడి అభివృద్ధికి తన వంతుగా రూ. 50వేలు నగదు అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక పూజలలో వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైఎస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచి వలి, ఎంపీటీసీ మేడగం వెంకట రామి రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డిలు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు. గ్రామ పెద్దలు సన్మానించారు.


