ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం – జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్

ప్రజాసమస్యల పరిష్కార సిపిఎం లక్ష్యమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ అన్నారు. దర్శి సుందరయ్య భవనంలో బుధవారం సిపిఎం దరిశి నియోజకవర్గ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల మీద వైసిపి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను భారీగా పెంచిందన్నారు. మణిపూర్ మారణ హోమం జరిగిన బిజెపికి పార్లమెంటులో టిడిపి, వైసిపి మద్దతు పలకడం దుర్మార్గమని విమర్శించారు. బిజెపి పాలనకు విశ్వాస తీర్మానంలో రాష్ట్రం మోడీకి సపోర్టు చేయడం కేంద్రానికి లొంగిపోవడమేనని విమర్శించారు. ఈ సందర్భంగా నూతన ఆర్థిక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే అంశంపై తరగతులు బోధించారు. కార్యక్రమంలో సందు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా నాయకులు వెల్లంపల్లి ఆంజనేయులు, కెవి పిచ్చయ్య, పుల్లయ్య, నారాయణ, నాగేశ్వరరావు, గంగయ్య, ఇమ్మాయిల్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *