గర్భిణీలు చిన్నారుల లో నులిపురుగులు ఉన్నట్లయితే మానసిక ఎదుగుదల లోపిస్తుందని వైద్యాధికారులు సిహెచ్ ప్రవీణ్ కుమార్, బి మధు శంకర్ లు తెలిపారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులలో నులిపురుగులు ఉన్నట్లయితే రక్తహీనత వస్తుందన్నారు. పిల్లలలో మానసకు ఎదుగుదల లోపిస్తుంది అన్నారు. సరిగా ఆకలి లేకపోవడం, మలబద్ధకం ఏర్పడుతుందన్నారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో5808 పిల్లలకు గాను5227 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కే ఏ రాజు, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, ఉపాధ్యాయుడు మాగులూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
