గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగి ఉండాలి – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కే శ్యాంబాబు

పాఠశాల విద్యను అభ్యసించే విద్యార్థులు లైంగిక దోపిడీకి గురికాకుండా ఉండాలంటే గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కే శ్యాంబాబు అన్నారు. పివిఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ …గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు . కౌమార దశలో ఉన్న బాలికలు సోషల్ మీడియా సైట్లు అయినా ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా అనేక రకాలైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు . ముఖ్యంగా బాలికలు బంధుత్వం ముసుగులో స్నేహం ముసుగులో బంధాల పేరుతో లైంగిక దోపిడీకి గురి చేస్తారని అటువంటి వారిపట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. సఖి వస్ స్టాప్ సెంటర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వి. గౌతమి మాట్లాడుతూ ….పోలీస్ శాఖ ద్వారా వివిధ పాఠశాలలో గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అనే అంశం మీద అవగాహన కలిగి చేస్తున్నామని అన్నారు. జిల్లా బాలల సంక్షేమ అధికారి దినేష్ మాట్లాడుతూ… బాలికలను ప్రేమ పేరుతో వంచించడం దుర్బుద్ధితో తాకటం చట్టరీత్యా నేరమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, సఖి వస్ స్టాప్ సెంటర్ న్యాయవాది ఆర్.స్పందన మరియు పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కొంతమంది విద్యార్థులు వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం చుట్టూ మద్యం సేవిస్తూ ఇబ్బంది పేడుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకుని వచ్చారు. తదనంతరం న్యాయమూర్తి సమస్య పరిష్కారానికి పోలీస్ శాఖ వారికి తెలియపరచి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తదనంతరం న్యాయమూర్తి వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *