శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో బూచేపల్లి తన్విక పుట్టినరోజు వేడుకలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నందిని దంపతుల కుమార్తె బూచేపల్లి తన్విక జన్మదిన వేడుకల సందర్భంగా ముండ్లమూరు మండలంలోని జమ్మలమడక గ్రామంలో శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో బూచేపల్లి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభిషేకాలు స్వామివారికి చేశారు. అనంతరం దుర్గామాత అమ్మవారిని, నవగ్రహాలను రాహు కేతువులకు పాలాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బూచేపల్లి అభిమానులు పాల్గొని బూచేపల్లి తన్వికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో కాపా రమణారెడ్డి, సుగుణ, కాపా నరసింహారెడ్డి, కాపా రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *